ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ నామినేట్ అయ్యారు. పార్టీ ఆయన్ను అధ్యక్ష పదవికి నామినేట్ చేసింది. బిడెన్.. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బిడెన్ అభ్యర్థిత్వానికి గత, ప్రస్తుత డెమొక్రటిక్ నేతలు మద్దతునిచ్చారు.
ఈ సందర్భంగా బిడెన్ మాట్లాడుతూ.. డెమోక్రాటిక్ తరఫున తనను అధ్యక్ష పదివికి నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన జీవితంలో ఇది అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కూడా బిడెన్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ చేసారు. ‘మీ అందరికి ధన్యవాదాలు. ఈ ప్రపంచం నాకు, నా కుటుంబానికి మద్దతుగా ఉందని విశ్వసిస్తున్నాను’ అంటూ బిడెన్ ట్వీట్ చేశారు.
జో బిడెన్ గతంలో కూడా రెండు సార్లు అధ్యక్ష పదవికోసం తలపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం మూడవసారి. ఎన్నికలకు 77 రోజుల వ్యవధి ఉంది.

