బైడెన్ కు జై కొట్టిండ్రు.. అమెరికాకు 46వ ప్రెసిడెంట్

బైడెన్ కు జై కొట్టిండ్రు.. అమెరికాకు 46వ ప్రెసిడెంట్
  • బైడెన్ ఖాతాలోనే పెన్సిల్వేనియా, నెవాడ
  • మొత్తం 290 ఎలక్టోరల్ ఓట్లు..
  • మ్యాజిక్ ఫిగర్ కంటే 20 ఓట్లు ఎక్కువే
  • 214 ఓట్ల వద్దే ఆగిపోయిన ట్రంప్ 

అమెరికా ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. జో బైడెన్ కే అమెరికన్ లు జై కొట్టిండ్రు. ప్రెసిడెంట్ ట్రంప్ ను ఇగ ఇంటికి పొమ్మని చెప్పిన్రు. కౌంటింగ్ లో ఒక్కో స్టేట్ లో గెలుస్తూ వచ్చిన బైడెన్.. శుక్రవారం ఒక్క స్టేట్ గెలిస్తే చాలు.. ప్రెసిడెంట్ కావడం ఖాయం అన్నంతగా విజయానికి దగ్గరైండు. కానీ ఒక్కటి కాదు.. రెండు స్టేట్స్ ను గెలుచుకుని వైట్ హౌస్ లో పాగా వేసిండు. శనివారం నాలుగోరోజు కౌంటింగ్ లో ముందుగా పెన్సిల్వేనియాలో 33 వేల ఓట్ల లీడ్ తో, ఆ వెంటనే నెవాడ స్టేట్ లో 26 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఆయన.. 290 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుని అమెరికా ప్రెసిడెంట్ రేస్ లో విన్నర్ గా నిలిచిండు.

వాషింగ్టన్:అమెరికా హిస్టరీలోనే అత్యధికంగా ఏడున్నర కోట్ల ఓట్లను గెలుచుకున్న డెమొక్రటిక్​ లీడర్​ బైడెన్.. అగ్రరాజ్యానికి 46వ ప్రెసిడెంట్ గా తిరుగులేని విజయం సాధించిండు. పెన్సిల్వేనియాలో గెలవడంతోటే.. ట్రంప్ నుంచి ఎదురయ్యే చాలెంజెస్ అన్నింటినీ బైడెన్ ఓడించినట్లు అయింది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 270. ఈ ఎన్నికల్లో ట్రంప్ 214 ఓట్ల వద్దే ఆగిపోయిండు. బైడెన్ మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటిపోయి 290 ఓట్లు సాధించిండు. మరో 3 రాష్ట్రాల్లో రిజల్ట్స్ రావాల్సి ఉంది. జార్జియాలో బైడెన్ లీడ్ లో ఉన్నారు. ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ ను లెక్కలోకి తీస్కుంటే.. బైడెన్ కు 306 ఎలక్టోరల్ ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నరు.జో బైడెన్ (77) అమెరికా హిస్టరీలోనే అత్యధిక వయసు ప్రెసిడెంట్ గా రికార్డ్ సృష్టించారు. బైడెన్ రన్నింగ్ మేట్, ఇండియన్ ఆరిజిన్ సెనెటర్ కమలా హారిస్ తొలి భారత సంతతి వైస్ ప్రెసిడెంట్, తొలి బ్లాక్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ గా హిస్టరీ క్రియేట్ చేశారు.

బైడెన్ కు ఏడున్నర కోట్ల ఓట్లు..

దేశవ్యాప్తంగా 14.7 కోట్ల ఓట్లు పోల్ కాగా, బైడెన్ అమెరికా హిస్టరీలోనే అత్యధికంగా 74,857,880 (50.6%) ఓట్లు గెలుచుకున్నడు. ట్రంప్ కు 70,598,535 (47.7%) ఓట్లు వచ్చాయి. ట్రంప్ కన్నా బైడెన్ 42,59,345 ఓట్ల ఆధిక్యంతో ప్రెసిడెంట్ పదవిని కైవసం చేసుకున్నడు.

వైట్ హౌస్ విడిచి.. గోల్ఫ్​ క్లబ్ కు ట్రంప్

ఎలక్షన్ డే నుంచీ వైట్ హౌజ్ లోనే ఉండి తన టీమ్ ను నడిపించిన ట్రంప్ శనివారం పరిస్థితి మరింత దిగజారిపోవడంతో వైట్ హౌస్ ను విడిచి, వర్జీనియాలోని తన గోల్ఫ్​క్లబ్ కు వెళ్లిపోయారు. అయితే ‘ఈ ఎలక్షన్ లో నేనే ఎక్కువ గెలిచాను!’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

బైడెన్ గెలుపుపై ట్రంప్ కోర్టుకెళ్తరా?

ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, ఎలక్షన్ ఇంతటితో అయిపోలేదని, ఓటమిని ఒప్పుకోనని ట్రంప్ చెప్తూ వస్తున్నడు. ఎలక్షన్ ఫ్రాడ్ పై సుప్రీంకోర్టుకూ వెళ్తానని ప్రకటించిండు. ఇప్పటికే మిషిగన్, పెన్సిల్వేనియాతో సహా పలు రాష్ట్రాల్లో కౌంటింగ్ ఆపాలని ట్రంప్ కోర్టులకు వెళ్లగా జడ్జీలు రిజెక్ట్ చేశారు. అయితే పెన్సిల్వేనియాలో ఎలక్షన్ డే తర్వాత మూడు రోజులకు వచ్చిన బ్యాలట్లనూ ఇన్ టైంలో వచ్చినట్లుగా చూపుతున్నారని, దీనిపై రిపబ్లికన్ లు కోర్టుకెళ్లారు.  అయితే దీనిపై ఎలక్షన్ అయ్యేదాకా విచారణకు తీసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది.

నేను అందరివాడిని..

దేశానిన్ లీడ్ చేసే అవకాశం దకక్డం గొప్ప గౌరవం. ఈ అవకాశం నాకిచిచ్న మీకందరికీ థ్యాంక్స్. మనమంతా కలిసి ముందుకు సాగుదాం. ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేశారనేది నాకనవసరం.. నేను అందరి వాడిని, అమెరికన్లందరికీ ప్రెసిడెంట్నే’

‑ జో​ బైడెన్

ఓటమిని ఒప్పుకోను

ఓటమిని ఒప్పుకోను. ప్రెసిడెంట్​ ఎన్నిక ఇంకా పూర్తికాలే. ఫలితాలను కోర్టులో సవాల్​ చేస్తా. విన్నర్​గా ప్రకటించుకు నేందుకు బైడెన్​ ఎందుకు తొందర పడుతున్నారో మాకందరికీ తెలుసు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఆయనకు హెల్ప్​ చేస్తున్నయ్. అసలు నిజాలు బయటకు రావడం వారికిష్టంలేదు.

– డొనాల్డ్​ ట్రంప్

కలిసి పనిచేద్దాం

అద్భుత విజయం సాధించిన జో బైడెన్​కు, కమలా హారిస్​కు అభినందనలు. ఇండియా, అమెరికా సంబంధాలు అమూల్యమైనవి. ఇరుదేశాల బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను. కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం.

– ప్రధాని నరేంద్రమోడీ