వరంగల్ కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా

వరంగల్ కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా

అవినీతిని ప్రశ్నిస్తూ వార్తలు రాస్తే అక్రిడిటేషన్లు రద్దు చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నా చేశారు. అవినీతి అధికారులకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.

టీచర్ల బదిలీల్లో వరంగల్ డీఈవో వాసంతి అక్రమాలకు పాల్పడ్డారని వార్త రాస్తే.. విచారణ జరపాల్సిన కలెక్టర్ వార్త రాసిన జర్నలిస్టు అక్రిడిటేషన్ రద్దు చేయాలని షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. నోటీసులు ఉపసంహరించుకోవాలని కలెక్టర్ గోపికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు . ఈ నిరసనలో ఉమ్మడి వరంగల్ జర్నలిస్టు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.