రాహుల్ గాంధీ మాటలు జవాన్ల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నయ్: జేపీ నడ్డా

రాహుల్ గాంధీ మాటలు జవాన్ల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నయ్: జేపీ నడ్డా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్తాన్, చైనా భాష మాట్లాడతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు జవాన్ల అత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దారుణంగా మాట్లాడారని..వీటిని ఎంత ఖండించినా తక్కువే అన్నారు.  ధైర్యం, తెగువకు భారత సైన్యం ప్రతీక అని తెలిపారు. భారత సైన్యం డోక్లామ్ వద్ద ఉంటే రాహుల్ చైనా దౌత్య కార్యాలయానికి వెళ్లి చైనా అధికారులను కలిశారని ఆరోపించారు.

కేంద్రంపై రాహుల్ విమర్శలు..

అరుణాచల్, లడఖ్ రెండు వైపుల నుంచి యుద్ధానికి చైనా సిద్ధమవుతుంటే..కేంద్రం మాత్రం గాఢనిద్రలో ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం  అంగీకరించడం లేదని చెప్పారు. ఈ వాస్తవాన్ని కేంద్ర ఫ్రభుత్వం దాచిపెడుతోందన్నారు. చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. “నేను గత రెండు, మూడు సంవత్సరాలుగా ఇదే చెబుతున్నాను. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముప్పును కేంద్ర ప్రభుత్వం దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాలను ఎక్కువ కాలం దాచలేం” అని రాహుల్ గాంధీ  అన్నారు.