
ఎన్టీఆర్ చిత్రాలకు గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీ రావడంతో తన క్రేజ్ బాలీవుడ్‌లో మరింత పెరిగింది. ప్రస్తుతం తను ‘దేవర’ చిత్రంతో పాటు హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’లో నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ‘దేవర’ షెడ్యూల్ పూర్తి చేసిన ఎన్టీఆర్... తాజాగా ‘వార్2’ షూటింగ్‌కు రెడీ అయ్యాడు. దీనికోసం గురువారం ముంబై వెళ్లాడు ఎన్టీఆర్. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.
ఈ సందర్భంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ఉన్న తన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ క్యాప్ పెట్టుకుని స్టైలిష్ అవతార్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ స్పై యూనివర్స్‌లో ఏజెంట్ కబీర్ పాత్రలో హృతిక్ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించటం ఖాయమంటున్నారు మేకర్స్. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది.