ఈ నెల 7న జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ.. ఇష్యూ సైజు రూ.3,600 కోట్లకు తగ్గింపు

ఈ నెల 7న జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ..  ఇష్యూ సైజు రూ.3,600 కోట్లకు తగ్గింపు

న్యూఢిల్లీ:  జేఎస్​డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ ఈ నెల 7–11 తేదీల్లో ఉంటుంది. ఇష్యూ సైజును రూ.నాలుగు వేల కోట్ల నుంచి రూ.3,600 కోట్లకు తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది.  యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ తేదీ ఆగస్టు ఆరున ఉంటుంది. ఐపీఓలో రూ.1,600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్​ఇష్యూ, రూ.2,000 కోట్ల వరకు విలువైన ఆఫర్​ఫర్​ సేల్ ​ఉంటుంది. 

ఓఎఫ్​ఎస్​లో భాగంగా, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అపోలో మేనేజ్‌‌‌‌మెంట్, దాని అనుబంధ సంస్థ ఏపీ ఆసియా ఆపర్చునిస్టిక్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ హోల్డింగ్ లిమిటెడ్, ఎస్​బీఐ షేర్లను అమ్ముతాయి.  ఫ్రెష్​ఇష్యూతో వచ్చిన డబ్బును కంపెనీ రాజస్థాన్‌‌‌‌లోని నాగౌర్‌‌‌‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ సిమెంట్ యూనిట్‌‌‌‌ నిర్మాణానికి, అప్పుల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.  

ఈ ఏడాది మార్చి 315 నాటికి, జేఎస్​డబ్ల్యూ సిమెంట్ మొత్తం అప్పులు రూ.6,166.6 కోట్లుగా ఉన్నాయి.  కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.163.77 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మార్చి 31, 2025 నాటికి, జేఎస్​డబ్ల్యూ సిమెంట్​కు సంవత్సరానికి 20.60 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యం ఉంది.