రూ. 5 వేల కోట్లు సేకరించిన జేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎనర్జీ

రూ. 5 వేల కోట్లు సేకరించిన జేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎనర్జీ

న్యూఢిల్లీ: అబుదబీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) తో సహా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు షేర్లను అమ్మడం ద్వారా రూ.5 వేల కోట్లను జేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎనర్జీ సేకరించింది. బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింతగా విస్తరించడానికి ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడతామని తెలిపింది. రూ.5 వేల కోట్ల విలువైన క్వాలిఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూఐపీ) ని సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పూర్తి చేశామని  రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్లూ ఎనర్జీ పేర్కొంది.  

ఇష్యూ సైజ్ కంటే 3.2 రెట్లు ఎక్కువ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ సాధించామని వెల్లడించింది. జీక్యూజీ, బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నోమురా, వెల్లింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏడీఐఏ వంటి టాప్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీలు జేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ క్యూఐపీ ఇష్యూలో పాల్గొన్నాయి.