విమానంలో తింగరి బుచ్చి వేషాలు.. మూడు టికెట్లు కొనుక్కుని పిచ్చి చేష్టలు

విమానంలో తింగరి బుచ్చి వేషాలు.. మూడు టికెట్లు కొనుక్కుని పిచ్చి చేష్టలు

ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకుని బిజినెస్ క్లాస్ లాగా ప్రయాణించేందుకు ఓ మహిళ దేశీ జుగాడ్ ఆడింది. వీడియో చూసిన తర్వాత మీరు కూడా వావ్ అంటారు. అయితే చివరికి ఆ మహిళకు ఏం జరిగిందో ఆమె ఊహించలేదు. మూడు టికెట్లు కొని బెడ్ గా మార్చింది. మరి  అసౌకర్యం కలిగితే తోటి ప్రయాణికులు ఊరుకుంటారా.. మరి ఏం చేశారో మీరే చూడండి..

విమానంలో ప్రయాణం చేయాలని అందరూ అనుకుంటారు.  ఒకసారి  ఎకానమీ క్లాసులో ప్రయాణించిన వారు  బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే అవకాశం పొందాలన్నారు. ఎందుకంటే బిజినెస్ క్లాస్ సీటు చాలా పెద్దగా ఉండి  సోఫా అనుభూతిని కలిగిస్తుంది.  ఈ సీట్లలో  కాళ్లు పెట్టుకొనేందుకు వీలుగా చాలా  స్పేస్ ఉంటుంది. బిజినెస్ క్లాస్ లో  ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.  ఎంతంటే ఆర్డినరీ బస్సులకు.. వోల్వా బస్సులకు ఉన్నతం తేడా అన్నమాట. అయితే దీని టిక్కెట్టు చాలా ఖరీదైనది. అది సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఎకానమీ క్లాస్ టికెట్ 5 వేలు అయితే, బిజినెస్ క్లాస్ కు 10 వేలు. అందుకే చాలా మంది వెళ్లలేకపోతున్నారు. అయితే దీని కోసం ఓ మహిళ దేశీ జుగాద్ తీసింది.  దీని వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే చివరికి ఆ మహిళకు ఏం జరిగిందో ఆమె ఊహించలేదు.

మంచం మాదిరిగా ప్లైట్ సీట్స్ 

ఈ వీడియో @TansuYegen ఖాతా నుండి ట్విట్టర్‌లో  పోస్టు అయింది. ఇందులో ఎకానమీ క్లాస్‌లో ఒక మహిళ మూడు  టికెట్లు తీసుకుంది.    ఆమె మూడు సీట్లను ప్లాస్టిక్ కవర్ ను చుట్టి  బెడ్ (మంచం) మాదిరిగా తయారు చేసింది.  సులువుగా నిద్రపోయేలా మంచం లాంటి పరుపును పెడుతోంది. మరో మహిళా ప్రయాణికురాలు ఆమెకు సహాయం చేస్తూ కనిపించారు.  వీరి చేష్టలు ఇంకొకరికి అంతరాయం కలుగడంతో.. వారు  సిబ్బందికి కాల్ చేశారు.   అప్పుడు  ఫ్లైట్ అటెండెంట్ వచ్చి ప్లాస్టిక్ కవర్ ను తీసేశారు.  దీంతో వారిద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది.  ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటివరకు 9 లక్షల లైక్ లు వచ్చాయి. టిక్‌టాక్‌లో  దీనిని 38 లక్షలకు పైగా వీక్షించారు.

నెటిజన్ల అభిప్రాయాలు

ఈ ఫ్లైట్  ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందినదో .. అది ఎక్కడిదో తెలియదు  కానీ...  వినియోగదారులు  మాత్రం వీడియోకు సంబంధించి వివిధ రకాల ప్రశ్నలను అడుగుతున్నారు. ఎవరైనా దీన్ని చేయగలరా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కమర్షియల్ ఫ్లైట్ ఘటనలో క్లింగ్ ర్యాప్ పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. 2019లో, ఫుకెట్‌కి వెళ్లే విమానంలో ప్రయాణీకులు వికృత ప్రయాణికుడిని లొంగదీసుకోవడానికి అతుక్కొని వ్రాప్‌తో కట్టివేసారు. అనంతరం విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.

https://twitter.com/TansuYegen/status/1668968989664354305