5Gతో పర్యావరణానికి ముప్పు..కోర్టులో జుహీ చావ్లా పిటిషన్

5Gతో పర్యావరణానికి ముప్పు..కోర్టులో జుహీ చావ్లా పిటిషన్

వైర్ లెస్ నెట్వర్క్ సేవలుగా ప్రచారం పొందుతున్న 5G భారత్ లోనూ ఎంటరవుతోంది. అత్యంత స్పీడ్ తో ఇంటర్నెట్ సర్వీసులు, ఫోన్ సేవలు 5జీతో సాధ్యం. అయితే.. 5G కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందన్న వాదనలు కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. భారత్ లో 5జీ సేవలను వ్యతిరేకిస్తూ ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
 
సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును తాము వ్యతిరేకించడంలేదని.. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న కొత్త ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నామని తెలిపారు జుహీ చావ్లా. అయితే.. ఆ తర్వాత జనరేషన్స్ కు పరికరాల ఉపయోగించడంలో అయోమయం ఏర్పడుతోందన్నారు. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నదానికి ఇదే తగిన కారణమన్నారు. ప్రజల భద్రతకు ఇది హానికరం అని భావిస్తున్నామన్నారు. జుహీ. అయితే, కేంద్ర టెలింకా శాఖ మాత్రం  ఇలాంటి వాదనలను ఒప్పుకోవడం లేదు.