Asian Games 2023: స్మృతి నా దేవత..: చైనా యువకుడు

Asian Games 2023: స్మృతి నా దేవత..: చైనా యువకుడు

అమ్మాయిలకు ఆటతో పాటు అందం ఉంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. ఒకప్పుడు సానియా మీర్జా, అశ్విన్ పొన్నప్ప, జ్వాలా గుప్తా లాంటి క్రీడాకారిణిలు అందంతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నారు. వీరి తర్వాత ఆ లిస్టులోకి భారత క్రికెట్ మహిళల క్రీడాకారిణి స్మృతి మందాన చేరింది. స్మ్రితి ఆటకంటే అందానికే చాలా మంది అభిమానాలున్నారు. ఇదిలా ఉండగా ఈమె అందానికి తాజాగా ఒక చైనీస్ కుర్రాడు ఫిదా అయ్యాడు. 

అతని పేరు జున్ యు. ఈ యువకుడు బీజింగ్‌కు చెందిన ఒక జియాలజీ విద్యార్థి.  'మంధన ది గాడెస్'ని ఆమెను కలుసుకోవాలనే ఆశతో రాత్రంతా హాంగ్‌జౌకు ప్రయాణించాను. అని బ్యానర్ పట్టుకుని స్టాండ్స్‌లో నడుస్తూ కనిపించాడు. "నేను ఆమె అభిమానిని. ఇంటర్నెట్‌లో ఆమె వీడియోలు, గేమ్ ఆడటం చూస్తాను. ఆమె ఆడే విధానం, ఆడే శైలి నాకు చాలా ఇష్టం" అని జున్ యు స్మృతిపై తన ఇష్టాన్ని తెలియజేశాడు. మొత్తానికి తన అందంతో స్మ్రితి చైనాలో ఒక పెద్ద అభిమానిని సంపాదించుకుంది.
 
కాగా.. చైనా, హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు బంగారం పతకం సాధించింది. నేడు (సోమవారం) శ్రీలంక మహిళా జట్టుతో జరిగిన ఫైనల్‌లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుంది. ఈ మ్యాచులో స్మృతి మందాన 46 పరుగులతో భారత జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచింది.