అమ్మాయిల అక్రమ రవాణా చేసే లారెన్స్, అతని తమ్ముడి నుంచి ప్రాణహాని

V6 Velugu Posted on Mar 10, 2020

  • లారెన్స్ తమ్ముడు లైైైంగికంగా వేధించాడు
  • కంప్లయింట్ ఇస్తే బ్రోతల్ కేసు పెట్టారు
  • అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారు
  • ఆ విషయం తెలియడంతో చంపాలనుకుంటున్నారు

హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్  తమ్ముడు విన్నీ తనను లైంగికంగా వేధిస్తున్నాడని  దివ్య అనే యువతి నాలుగు రోజుల క్రితం మీడియాకి తెలిపింది. 2015లో  లారెన్స్ తమ్ముడు వినోద్.. తనను వేధింపులకు గురి చేశాడని, అప్పటి వెస్ట్ మారెడ్ పల్లి సీఐ రవీందర్ రెడ్డికి ఫిర్యాదు చేయగా.. తనపై అక్రమంగా బ్రోతల్ కేసు పెట్టి వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. అతడు సీఐ నుంచి ఏసిపిగా ప్రమోషన్ అయ్యారని కూడా తెలిపింది.

ఈ విషయంపై మంగళవారం.. ఎస్సి , ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసిన ఆమె.. లారెన్స్ , అతని తమ్ముడి విన్నీ , ఏసీపీ రవీందర్ రెడ్డి లపై ఆరోపణలు చేసింది. లారెన్స్ తమ్ముడు తనను ప్రేమ పేరుతో వేధించాడని , న్యాయం కోసం 2015లో మరేడుపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తే , అప్పటి సిఐ రవీందర్ తనపై అక్రమంగా బ్రోతల్ కేసు పెట్టి వేధిస్తున్నారని కమిషన్ చైర్మన్ కు వివరించింది.

తనలాగే అనేక మంది మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తూ..  లారెన్స్ , అతని తమ్ముడు అక్రమ రవాణా పాల్పడుతున్నారని తన ఫిర్యాదు లో పేర్కొంది. వారి విషయాలు తనకు తెలియడంతో తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ,   వారి నుండి రక్షణ కల్పించాలని ఆమె కోరింది.

Tagged allegations, raghava lawrence, ACP Ravinder reddy, Junior artist Divya, vinod

Latest Videos

Subscribe Now

More News