
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో నిరసన చేస్తున్న డాక్టర్లు.. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. తమ ఉద్యమాన్ని కించపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యమం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నార్త్, డెరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లను తొలగించారని, ఇది తమకు పాక్షిక విజయమని పేర్కొన్నారు.