తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి

తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: వనపర్తి జిల్లా లక్ష్మీపల్లిలో జరిగిన శ్రీధర్ రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జూపల్లి  కృష్ణారావు తెలిపారు. ఈ ఘటనలో పూర్తి వివరాలు తెలుసుకోకుండానే తన హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించడాన్ని ఖండించారు. 

శుక్రవారం గాంధీ భవన్​లో కాంగ్రెస్ సీనియర్​ నేత మల్లు రవితో కలిసి మీడియాతో జూపల్లి మాట్లాడారు. ‘‘శ్రీధర్ రెడ్డికి రాజకీయాలకు సంబంధం లేదు. అక్కడి మాజీ ఎమ్మెల్యేకు ఆయన చుట్టం. ఆ ప్రాంతంలో శ్రీధర్ రెడ్డి వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఆయన కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తాం” అని పేర్కొన్నారు. ఈ అంశాలపై అవగాహన లేకుండా కేటీఆర్, ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ తనపై ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇంకోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.