
గద్వాల, వెలుగు: కర్నాటకలోని ప్రాజెక్ట్ లతో పాటు భీమా నదిపైన సన్నతి బ్యారేజీ నుంచి వరదలు వస్తుండడంతో శనివారం జూరాల ప్రాజెక్ట్13 గేట్లను మళ్లీ ఓపెన్ చేశారు. ప్రాజెక్టులోని 1 లక్ష 25 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ గేట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి 31,913 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, రైట్ కెనాల్ కు 700 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింకు కెనాల్ కు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,25,971 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.