జాన్సన్ అండ్ జాన్సన్కు రూ.8 వేల 500 కోట్ల జరిమానా !

జాన్సన్ అండ్ జాన్సన్కు రూ.8 వేల 500 కోట్ల జరిమానా !
  • యూఎస్ సుప్రీం కోర్టులో కంపెనీ అప్పీల్‌‌‌‌ చేసే అవకాశం
  • టాల్కమ్ బేబీ పౌడర్‌‌‌‌‌‌‌‌ వాడడంతో క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో చనిపోయిన మే మూర్‌‌‌‌‌‌‌‌
  • 67 వేల క్యాన్సర్ ఆరోపణ కేసులను ఎదుర్కొంటున్న జేజే

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ (జేజే) కి అమెరికా కోర్ట్ షాకిచ్చింది. ఈ కంపెనీకి చెందిన టాల్కమ్‌‌‌‌ పౌడర్ వాడి 88 ఏళ్ల మహిళ మృతి చెందిందని తేల్చుతూ, ఆమె కుటుంబానికి  సుమారు బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ పౌడర్‌‌‌‌‌‌‌‌లో అస్బెస్టాస్ ఫైబర్లు ఉన్నాయని, దీంతో అరుదైన క్యాన్సర్ వచ్చి మే మూర్ చనిపోయిందని ఆమె కుటుంబం ఆరోపించింది.

లాస్ ఏంజిలిస్​ కోర్ట్ జ్యూరీ 16 మిలియన్ డాలర్ల నష్టపరిహారం, 950 మిలియన్ డాలర్ల శిక్షాత్మక నష్టపరిహారం ఇవ్వాలని జేజేను ఆదేశించింది.  అయితే, యూఎస్‌‌‌‌ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ప్రకారం, శిక్షాత్మక నష్టపరిహారం సాధారణంగా నష్టపరిహారానికి 9 రెట్లు మించకూడదు. దీంతో  పై కోర్ట్ అప్పీల్‌‌‌‌లో ఈ జరిమానా తగ్గే అవకాశం ఉంది. జేజే  తమ ఉత్పత్తులు సురక్షితమైనవని, అస్బెస్టాస్ లేదని, క్యాన్సర్ కలిగించవని పేర్కొంది.