మీరు కొన్న బంగారం ప్యూరిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యిందా..? ఏం చేయాలో తెలుసుకోండి..

మీరు కొన్న బంగారం ప్యూరిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యిందా..? ఏం చేయాలో తెలుసుకోండి..

దసరా తర్వాత చాలా మంది ఎక్కువగా బంగారం కొనే రోజుల్లో ధనత్రయోదశి, దీపావళి కూడా ముఖ్యమైనవే. భారతీయుల జీవితంలో బంగారానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉన్నందున రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పండుగల సమయంలో ఆభరణాల దుకాణాలు జనంతో కిటకిటలాడుతాయి. జీవితంలో సమృద్ధి, ఆర్థిక భద్రత, అదృష్టానికి ప్రతీకగా బంగారం కొనుగోలు చాలా మందికి అలవాటుగా మారింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా, రుణాల కోసం తాకట్టుకు ఉపయోగిస్తున్నారు.

రోజురోజుకూ రేట్లు పెరుగుతుండటంతో.. కొనుక్కునే అవకాశం కోల్పోతామనే భయాలు చాలా మందిని షాపింగ్ చేసేలా చేస్తోంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు కస్టమర్లను మోసం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ బంగారం నాణ్యత విషయంలో 22 క్యారెట్ల వస్తువులే ఇస్తున్నారా లేక మోసం చేస్తున్నారా అనే వివరాలను కొనుగోలుదారులు తప్పకుండా గమనించాలి. అందువల్ల మీరు కొంటున్న బంగారం నిజంగా ఎంత స్వచ్ఛమైనది? అనే వివరాలు పరిశీలించుకోవటం కూడా ముఖ్యమే. అందుకే బీఐఎస్ హాల్ మార్కింగ్ కలిగిన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయటం ఉత్తమం. 

ఇలా హాల్ మార్కింగ్ ఉన్న ఆభరణాల కొనుగోలు ప్రజలను కల్తీ బంగారు మోసాలనుంచి రక్షిస్తూ, తయారీదారులు నిర్దేశించిన శుద్ధత ప్రమాణాలను తప్పకుండా పాటించేలా చేస్తుంది. ప్రస్తుతం హాల్‌మార్కింగ్ భారత్‌లో బంగారం, వెండికి తప్పనిసరి చేయబడింది.

ALSO READ : రోజుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బు తీసుకోకూడదా..?

టెస్ట్ చేసినప్పుడు బంగారం ఫ్యూరిటీ విషయంలో ఫెయిల్ అయితే..
ప్రజలు తాము కొనుగోలు చేసిన ఆభరణం నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ శుద్ధత కలిగినదిగా తేలితే.. మీకే నష్టం. BIS రూల్స్ 2018 లోని 49వ విభాగం ప్రకారం.. బంగారం నిర్దేశిత శుద్ధత కంటే తక్కువగా ఉంటే వ్యాపారి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ శుద్ధత లోటు ఆధారంగా వచ్చిన తేడా మొత్తానికి రెండింతలు, పరీక్షకు అయిన ఛార్జీలు వ్యాపారి కొనుగోలుదారుడికి పరిహారంగా చెల్లించాలి.

పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసేపుడు ఆభరణంపై BIS హాల్‌మార్క్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మీ పెట్టుబడిని భద్రంగా ఉంచడమే కాకుండా, మోసపోకుండా కాపాడుతుంది.