Gold Rate: భారీగా పడిపోయిన బంగారం రేటు.. రూ.లక్షా 80వేలు తాకిన కేజీ వెండి..

Gold Rate: భారీగా పడిపోయిన బంగారం రేటు..  రూ.లక్షా 80వేలు తాకిన కేజీ వెండి..

Gold Price Today: ఈ వారం ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం రేట్లు శుక్రవారం రోజున తిరిగి తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా హమాల్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం వంటి ఘటనలతో పాటు గరిష్ఠాల వద్ద స్పాట్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ వంటి కీలక కారణాలు రేట్ల పతనానికి దారితీసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు షాపింగ్ చేయటానికి ముందుగా తమ ప్రాంతాల్లో రేట్లను తెలుసుకోవటం మంచిది.

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 9తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 10న రూ.1860 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.186 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 10న):
హైదరాదాబాదులో రూ.12వేల 229
కరీంనగర్ లో రూ.12వేల 229
ఖమ్మంలో రూ.12వేల 229
నిజామాబాద్ లో రూ.12వేల 229
విజయవాడలో రూ.12వేల 229
కడపలో రూ.12వేల 229
విశాఖలో రూ.12వేల 229
నెల్లూరు రూ.12వేల 229
తిరుపతిలో రూ.12వేల 229

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 9తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 10న 10 గ్రాములకు రూ.170 తగ్గింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

ALSO READ : రూ.3 వేల 151 కోట్ల బకాయిలు చెల్లించండి.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 10న):
హైదరాదాబాదులో రూ.11వేల 210
కరీంనగర్ లో రూ.11వేల 210
ఖమ్మంలో రూ.11వేల 210
నిజామాబాద్ లో రూ.11వేల 210
విజయవాడలో రూ.11వేల 210
కడపలో రూ.11వేల 210
విశాఖలో రూ.11వేల 210
నెల్లూరు రూ.11వేల 210
తిరుపతిలో రూ.11వేల 210

మరోపక్క వెండి తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. అక్టోబర్ 10న కేజీకి వెండి అక్టోబర్ 9తో పోల్చితే రూ.3వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 80వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.180 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.