మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు : లోక్ అదాలత్లో పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ జిల్లాలోని మొత్తం 14 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి మనోజ్, జూనియర్ సివిల్ జడ్జి, పోలీసులు పాల్గొన్నారు.
ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్..
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి.రజని సూచించారు. శనివారం వనపర్తిలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులు, డీఎస్పీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
