కాళేశ్వరం అవినీతిలో స్థానిక ఎమ్మెల్యే భాగస్వామి : జువ్వాడి నర్సింగరావు

కాళేశ్వరం అవినీతిలో స్థానిక ఎమ్మెల్యే భాగస్వామి : జువ్వాడి నర్సింగరావు

మల్లాపూర్, మెట్‌‌పల్లి, ఇబ్రహీంపట్నం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌రావుకు భాగముందని  కాంగ్రెస్​ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. రూ.100 కోట్ల కాంట్రాక్టు పనులు తీసుకొని నాసిరకంగా నిర్మించారన్నారు. ఆదివారం మల్లాపూర్​ మండల కేంద్రంలో సుమారు 3వేల మంది కార్యకర్తలతో బైక్​ర్యాలీ, ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్​లో  ప్రచారం చేశారు.

అనంతరం మల్లాపూర్‌‌‌‌లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే.. తన కొడుకుకు టికెట్‌‌ ఇప్పించుకునేందుకు ప్రగతిభవన్ చుట్టూ తిరిగాడు తప్ప నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఏనాడూ ప్రయత్నించలేదన్నారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు గుంజుకున్నారని ఆరోపించారు. కృష్ణారావు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు విలువచేసే పుడూర్ ఖాదీ భూములను తక్కువ రేటుకు తన బీఆర్ఎస్ లీడర్లకు అమ్మి కమీషన్లు తీసుకున్నాడని ఆరోపించారు.

అనంతరం మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 600 మంది, మెట్ పల్లి మండలానికి చెందిన 100 మంది, ఇబ్రహీంపట్నం మండలానికి సుమారు 200 మంది కార్యకర్తలు నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో లీడర్లు శ్రీనివాస్ రెడ్డి, చిన్నారెడ్డి, జలపతి రెడ్డి , బాపు రెడ్డి, దేవయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్ రెడ్డి, మంజుల, సత్తమ్మ  పాల్గొన్నారు.