స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : జువ్వాడి నర్సింగరావు

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. గురువారం బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మండలాలకు చెందిన లీడర్లు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కోరుట్ల మండలం మాదాపూర్ మాజీ సర్పంచ్ దారిశెట్టి గణేశ్‌‌‌‌‌‌‌‌ బీజేపీకి రాజీనామా చేసి అనుచరులతో కలిసి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు.

 మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్​, బీజేపీ కి చెందిన సుమారు 100 గిరిజన, వడ్డెర సంఘాల లీడర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, కోరుట్ల ఏఎంసీ అంజిరెడ్డి, బ్లాక్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు సత్యనారాయణ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌,  లీడర్లు పాల్గొన్నారు.