డబ్బుకు ఆశపడితే మోసపోవడం ఖాయం :కె రాజు

డబ్బుకు ఆశపడితే మోసపోవడం ఖాయం :కె రాజు

ఆమనగల్లు, వెలుగు: ఎన్నికల్లో నాయకులు పంచే డబ్బులకు ఆశపడితే ఐదేండ్లు మోసపోవడం ఖాయమని జై భారత్  సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె రాజు పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లులో ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ఓటు అమ్ముకుంటే బతుకుతున్న శవంతో సమానం’ పోస్టర్ ను సంస్థ ప్రతినిధులతో కలిసి రిలీజ్  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలును ఎండగడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల బాధ్యతను చాటిచెబుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థుల నైతిక ప్రవర్తన, అర్హత, నిబద్ధత, సమర్థత అంశాలను పరిశీలించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జహంగీర్ పాషా, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.