
కరెక్ట్ కంటెంట్‌తో కష్టపడి సినిమా తీస్తే విజయం దక్కుతుందని ‘కె ర్యాంప్’ ప్రూవ్ చేసిందని నిర్మాత దిల్ రాజు అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి వసూళ్లను రాబడుతోందని టీమ్ చెప్పింది. K ర్యాంప్ రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.17.5 కొట్ల గ్రాస్ సాధించింది. అంతేకాకుండా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి కిరణ్ సత్తా ఏంటో నిరూపించింది.
ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, ఎస్ కేఎన్, డైరెక్టర్స్ శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ఠ అతిథులుగా హాజరై టీమ్‌ను అభినందించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘మా సినిమాను నిలబెట్టిన ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా కెరీర్‌లో ఇంతకంటే పెద్ద సక్సెస్‌లు రావొచ్చు.. కానీ మా నమ్మకాన్ని నిలబెట్టిన విజయమిది’ అని చెప్పాడు.
ఈ సినిమా సక్సెస్ తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని హీరోయిన్ యుక్తి తరేజా చెప్పింది. కిరణ్ చేసిన కుమార్ క్యారెక్టర్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారని దర్శకుడు నాని అన్నాడు.
నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ ‘మొదట మా సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ మా నమ్మకాన్ని నిలబెడుతూ సూపర్ సక్సెస్ అందుకుంది. ముందునుంచీ మాది ఫ్యామిలీ మూవీ అని చెబుతూ వచ్చాం. మేము చెప్పినట్లే అందరూ సినిమాను ఇష్టపడుతున్నారు’ అని చెప్పారు.
ఇక ఇదే వేదికపైనే రాజేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘K-ర్యాంప్' బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయినా సరే ఒక వెబ్ సైట్ ఇంకా మా మీద ఏడుస్తూనే ఉంది. అమెరికాలో ఉన్న వాడికి చెప్తున్నా.. పగలగొడతా.. నీకేం తెలుసురా లుచ్చా నా కొ*కా.. 'డ్యూడ్' సినిమాకి 190K, నా సినిమాకి 46K అని ఏవేవో కలెక్షన్స్ వేస్తున్నావ్. అది తెలుగు, తమిళం కలిపిరా కుక్కా.. సినిమాని తొక్కుతావా. నువ్వు మగాడివైతే తొక్కురా.. ఒక మొగోడిగా చెప్తున్నా. ఒక్క హిట్టు సినిమాని తొక్కేయాలని వీడు ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ వేస్తున్నాడు. ఈ నా కొ*కుని ఏం చేయాలి.. నడిరోడ్డు మీద వీడ్ని ఉరి తీయాలి. మా మీద బతికే నా కొ*కా’’ అంటూ నిర్మాత రాజేష్ దండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇపుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది ఒక డబ్బులు పెట్టిన నిర్మాత ఆవేదన అని కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఇలా స్టేజిపై బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.