ప్రజా శాంతి పార్టీలో చేరాలని కవితకు కేఏ పాల్ ఆహ్వానం !

ప్రజా శాంతి పార్టీలో చేరాలని కవితకు కేఏ పాల్ ఆహ్వానం !

హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి ఆ పార్టీకి రాజీనామా చేసిన కవితను తన పార్టీలో చేరాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆహ్వానించారు. బీసీల కోసం పోరాడుతానని అంటున్న కవితకు ప్రజా శాంతి పార్టీనే సరైన రాజకీయ వేదిక అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీసీల కోసం పనిచేస్తూ, బీసీల పక్షాల నిలిచిన ఏకైన పార్టీ ప్రజా శాంతి పార్టీ అని ఆయన చెప్పారు. కవితను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తూ కేఏ పాల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు.

అయితే.. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత వేరే పార్టీల్లో చేరే ఆలోచనలో లేరు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు. అందరితో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ దిశగా నిర్ణయం తీసుకుంటానని ఆమె మీడియాకు తెలిపారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో అయితే కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

హరీష్ రావు టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత ట్రిగ్గర్ నొక్కారు. హరీశ్ రావు, సంతోష్ రావుతో జాగ్రత్త అంటూ తండ్రికి, అన్నకు చెప్పారు. పార్టీని కాపాడుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ‘మొత్తం వాళ్లే చేశారు నాన్నా’ అంటూ కవిత వారిరువురి మీదా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రేపు కేటీఆర్కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్కు ఇదే జరుగుతుంది. అని చెప్పుకొచ్చారు.

‘హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నా యి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్ రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్ రావు, సంతోష్ రావే’ అని కవిత అన్నారు.