Shefali Jariwala: బిగ్ షాక్.. 42ఏళ్లకే గుండెపోటుతో బిగ్బాస్ నటి మృతి..

Shefali Jariwala: బిగ్ షాక్.. 42ఏళ్లకే గుండెపోటుతో బిగ్బాస్ నటి మృతి..

ప్రముఖ నటి, మోడల్​, హిందీ బిగ్​ బాస్13​ ఫేమ్​ షెఫాలీ జరివాలా (Shefali Jariwala) కన్నుమూశారు. 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఆమె అకాల మరణం బాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

శుక్రవారం (జూన్ 27న) తన నివాసంలో షెఫాలీకి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఆమె భర్త పరాగ్​ త్యాగీ ముంబైలోని బెల్లెవూ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఉత్తర్​ప్రదేశ్​కి చెందిన ఆమె భర్త పరాగ్​ త్యాగీ టీవీ, సినిమాల్లో పనిచేస్తున్నారు. 

ప్రముఖ జర్నలిస్ట్​ విక్కీ లాల్వాని సోషల్​ మీడియా వేదికగా షెఫాలీ మరణ వార్తపై తొలి పోస్ట్​ చేశారు. “షెఫాలీ జరివాలా, ది కాంటా లగా గర్ల్​ ఇక మన మధ్యలో లేరు. ఆమె మరణానికి ఇంకా కారణం తెలియదు. కానీ ఆమెను ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మరణించారు. షెఫాలీ భర్త పరాగ్​ త్యాగీ, మరో ముగ్గురు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వార్తను ఆసుపత్రిలోని రిసెప్షన్​ స్టాఫ్​ ధ్రువీకరించారు. “ఇక్కడికి తీసుకొచ్చే లోపే షెఫాలీ జరివాలా ప్రాణాలు కోల్పోయారు,” అని వారు చెప్పారు,”అని విక్కీ పోస్ట్​ చేశారు. 

షెఫాలీ జరివాలా సినీ ఎంట్రీ:

2002లో 'కాంత లగా' అనే మ్యూజిక్​ వీడియోతో షెఫాలీ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. అప్పుడామే వయస్సు కేవలం 20ఏళ్లు మాత్రమే. ఈ సాంగ్ పాప్ సంస్కృతిలో సంచలనంగా మారడంతో షెఫాలీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇందులో భాగంగా బిగ్​ బాస్13లో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయింది. ఆ తర్వాత వెనక్కి చేసుకుండా వరుస షోస్, సినిమాల్లో నటించింది. 2004లో సల్మాన్, అక్షయ్ కుమార్ మరియు ప్రియాంక చోప్రా కలిసి నటించిన 'ముజ్సే షాదీ కరోగి'లో జరీవాలా కనిపించింది. 2015లో తన భర్త పరాగ్ త్యాగితో కలిసి 'నాచ్ బలియే' సీజన్ 5, 7లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఈ సమయంలో సడెన్ గా గుండెపోటుతో మరణించడం సినీ పరిశ్రమలో విషాదం నింపింది.