
కోవిడ్-19 (COVID-19) వైరస్ మరోసారి మనదేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 200కి పైగా యాక్టివ్ COVID-19 కేసులు నమోదవడంతో ఆందోళన పెరిగింది. లేటెస్ట్గా మరో బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా బారినపడినట్లు నేషనల్ మీడియా ఛానళ్లు వెల్లడించాయి. అలాగే నికితా దత్తాతో పాటు తన తల్లికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిపాయి.
ఈ క్రమంలో నికితా దత్తా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆహ్వానం లేని అతిథి (COVID-19)తన ఇంటి తలుపు తట్టిందంటూ దత్తా పోస్టులో తెలిపింది. తనతో పాటు తన తల్లికి కూడా ఈ మహమ్మారి సోకిందంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
"కోవిడ్ మా అమ్మగారికి మరియు నాకు హలో చెప్పడానికి వచ్చాడు. ఈ ఆహ్వానించబడని అతిథి ఎక్కువసేపు ఉండకూడదని ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ సూచించింది.
#NikitaDutta and her mother test COVID positive. pic.twitter.com/XrDc3evXRz
— Tellychakkar.com (@tellychakkar) May 22, 2025
గతంలో కూడా నికిత కోవిడ్ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. కబీర్ సింగ్ మరియు జ్యువెల్ థీఫ్ చిత్రాలలో తన పాత్రలకు పేరుగాంచిన నికితా దత్తాకు కరోనా సోకడం వల్ల తన ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
Also Read : అక్కినేని క్లాసిక్ హిట్కి పదకొండేళ్లు
ఇటీవలే మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి బాలీవుడ్ నటి, బిగ్ బాస్ 18 కంటెస్టెంట్ శిల్పా శిరోద్కర్ కరోనా బారినపడింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్ లో ఉండి కోలుకున్నట్లు సమాచారం.
నికితా దత్తా సినిమాలు:
కబీర్ సింగ్ సినిమాతో వీపరీతమైన ఫాల్లోవింగ్ సంపాదించుకుంది నిఖితా. ఇది 2019లో విడుదలైన హిందీ సినిమా. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డికి రీమేక్. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ, నికితా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు.
నికితా దత్తా 2012 ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ లేఖర్ హమ్ దీవానా దిల్ (2014) లో ఆమె ఒక చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, జ్యువెల్ థీఫ్ వంటి పలు సినిమాల్లో నటించి గుర్తింపుతెచ్చుకుంది.