
కొత్త సంవత్సరం కొత్త తరహా పాత్రలతో మెప్పిస్తామని చెబుతుంటారు హీరోయిన్స్. కాజల్ అగర్వాల్ కూడా కొత్తగా కనిపించబోతోంది. అవును.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ న్యూ ఇయర్‌లో అమ్మగా కనిపించబోతోంది. అయితే ఇది సినిమాలో కాదు.. రియల్ లైఫ్‌లో. న్యూ ఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లూ రివీల్ చేశాడు. ‘2022.. నిన్నే చూస్తున్నా’ అనే క్యాప్షన్‌కి ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కలిపి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు గౌతమ్. సెలెబ్రిటీస్ మొదలు అభిమానుల వరకూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2020 అక్టోబర్‌లో తన ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె, గత కొన్ని నెలలుగా సినిమాలు తగ్గించింది. దాంతో ఆమె తల్లి కాబోతోందని, అందుకే కొన్ని సినిమాల నుంచి తప్పుకుందనే టాక్ వచ్చింది. ఎట్టకేలకు అది నిజమేనంటూ న్యూ ఇయర్‌లో గుడ్ న్యూస్ చెప్పాడు గౌతమ్ కిచ్లూ. ఇక కాజల్ నటించిన ‘ఆచార్య’, హిందీలో ‘ఉమ’, తమిళంలో కరుంగపియమ్, ఘోష్టీ, హే సినామిక సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.