నిరుపేదల గొంతుక కాకా వెంకటస్వామి : జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత

నిరుపేదల గొంతుక కాకా వెంకటస్వామి : జడ్పీ మాజీ చైర్పర్సన్  సరిత

గద్వాల, వెలుగు: కాక వెంకట స్వామి నిరుపేదల గొంతుకగా నిలిచారని గద్వాల జడ్పీ మాజీ చైర్​పర్సన్  సరిత కొనియాడారు. ఆదివారం కాంగ్రెస్  ఆఫీస్​లో కాకా వెంకటస్వామి జయంతిని జరుపుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి కాకా ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేదలకు నీడను కల్పించిన మహానీయుడని కొనియాడారు. రాష్ట్రంలో కాకా అంటే తెలియని వారు ఉండరని, సాధారణ పేద కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే కార్మికులు, కర్షకుల కష్టాలు తీర్చేందుకు పోరాటం చేశారన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మధుసూదన్ బాబు, ఎల్లప్ప, భాస్కర్  యాదవ్, నర్సింలు, డీఆర్  శ్రీధర్, పాతపాలెం ఆనంద్ గౌడ్, ఆనంద్  పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ టౌన్: మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతిని తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్​నగర్​లో జరుపుకున్నారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. పవన్ కుమార్, ఆంజనేయులు, కృష్ణ, మనోహర్, మహేశ్ పాల్గొన్నారు.