కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 81మందిపై సస్పెన్షన్ వేటు

 కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం..  81మందిపై సస్పెన్షన్ వేటు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ర్యాగింగుకు పాల్పడ్డారన్న కారణంతో 81 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్సన్ కు గురైన వారిలో పీజీ  స్టూడెంట్స్28 మంది, కామర్స్ స్టూడెంట్స్28 మంది, ఎకనామిక్స్ చదువుతున్న 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 

జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ విద్యార్థినీలపై ఆరోపణలు ఉణ్నాయి. ఇదే విషయంపై యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థులు. విచారణ జరిపిన అనంతరం ర్యాగింగ్ నిజమేనని నిర్థారించి.. 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు కాకతీయ యూనివర్సిటీ అధికారులు. వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.