ముంగటపడని కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు

ముంగటపడని కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంప్ హౌస్ లు, 19 రిజర్వాయర్లు, కాల్వలను టూరిస్ట్ స్పాట్లుగా మార్చే కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ లో కదలిక లేదు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని దాల్ సరస్సులా రిజర్వాయర్లను అభివృద్ధి చేయాలని సీఎం చెప్పి మూడేండ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు. బ్యాక్ వాటర్ లో బోట్లు, బ్యారేజీల వద్ద ఫౌంటెన్లు‌‌‌‌‌‌‌‌, అమ్యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వాటర్ పార్కులు ఏర్పాటు కాలేదు. మూడు బడ్జెట్లలో ఇందుకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. రూపాయి రిలీజ్ చేయలేదు. నిరుడు గోదావరి వరదల టైం​లోపంప్ హౌస్ లు మునకతో నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ టూర్ మళ్లీ స్టార్​ కాలేదు.

రూ.1,350 కోట్లు ఇచ్చినా..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత టూరిజం అభివృద్ధికి 2020 వరకు సర్కార్ పెద్దగా నిధులు ఇవ్వలేదు. కేంద్రం అమలు చేస్తున్న స్వదేశీ దర్శన్, ప్రసాద్, నీతి ఆయోగ్ స్కీమ్ ల ద్వారా మంజూరైన వెయ్యి కోట్లతోనే టూరిస్ట్ స్పాట్లను డెవలప్ చేసింది. 2020–21 బడ్జెట్ లో కాళేశ్వరం బ్యారేజీలను టూరిస్ట్ స్పాట్లుగా డెవలప్ చేసేందుకు రూ.250 కోట్లు అలాట్​ చేసింది. మేడిగడ్డకు రూ.105 కోట్లు, కన్నెపల్లికి రూ.80 కోట్లు, అన్నారానికి రూ.25 కోట్లు, అన్నారం కెనాల్ టు కన్నెపల్లి పనులకు రూ.40 కోట్లు కేటాయించింది. కానీ ఆ ఏడాది పైసా విడుదల చేయలేదు. 2021–22లో కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ అనే పేరుతో రూ.350 కోట్లు కేటాయించింది. ముక్తీశ్వర టెంపుల్ నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి వరకు బ్యాక్ వాటర్ లో బోటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించాలని అధికారులు భావించినా నిధుల విషయంలో గ్రీన్ సిగ్నల్ రాలేదు. 2022–23 బడ్జెట్ లో రూ.750 కోట్లు కేటాయించింది. ఏడాది కావొస్తున్నా అధికారులను ప్రపోజల్స్ అడిగింది లేదు.. పనులు మొదలు పెట్టింది లేదు.

ప్రాజెక్టును చూడనిస్తలే..

ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరాన్ని చూసేందుకు టూరిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలలుగా పర్మిషన్ ఇవ్వడం లేదు. నిరుడు జులైలో గోదావరి వరదలతో అన్నారం(సరస్వతి), కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నీట మునిగాయి. కన్నెపల్లి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోటార్లు ధ్వంసం కావడంతో అప్పటి నుంచి కాళేశ్వరం సందర్శనకు ఎవరినీ రానివ్వడం లేదు. పలువురు నేతలు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే అడ్డుకుని వెనక్కి పంపేసింది. అక్కడ ఇప్పటికీ బందోబస్తు కొనసాగుతోంది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ ప్రతినిధులను తప్పా ఎవరినీ దరిదాపుల్లోకి వెళ్లనివ్వడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేయడానికి రూ.1,500 కోట్లు మంజూరు చేస్తున్నా. అన్నపూర్ణ, రంగ‌‌‌‌‌‌‌‌నాయ‌‌‌‌‌‌‌‌క సాగ‌‌‌‌‌‌‌‌ర్, మ‌‌‌‌‌‌‌‌ల్లన్న సాగ‌‌‌‌‌‌‌‌ర్, కొండ‌‌‌‌‌‌‌‌పోచ‌‌‌‌‌‌‌‌మ్మసాగ‌‌‌‌‌‌‌‌ర్, బ‌‌‌‌‌‌‌‌స్వాపూర్ రిజ‌‌‌‌‌‌‌‌ర్వాయ‌‌‌‌‌‌‌‌ర్లు, ఏడుపాయ‌‌‌‌‌‌‌‌ల వ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌దుర్గామాత ప్రాంతాలను అద్భుత‌‌‌‌‌‌‌‌ంగా మార్చాలి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల షూటింగ్ లు చేసుకునేలా డెవలప్​ చేయాలి.

‑ నిరుడు ఫిబ్రవరి 23న మ‌‌‌‌‌‌‌‌ల్లన్న సాగ‌‌‌‌‌‌‌‌ర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్