
వైద్య కోర్సుల పీజీ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను కాళోజీనారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ప్రకటించింది. పీజీ యునానీ, ఆయుర్వేద, హోమియో అదే విదంగా ఎంఎస్సీ నర్సింగ్, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫలితాలను విడుదల చేసింది. గత నవంబర్ లో పరీక్షలను నిర్వహించారు. యండి యునానీ, ఆయుర్వేద రెగ్యులర్ , హోమియోపతి సప్లమెంటరీ కోర్సుల మొదటి ఏడాది ఫలితాలను అదే విదంగా ఎంఎస్సీ నర్సింగ్, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులకు సంబంధించి ఫస్ట్ సెకండ్ ఇయర్ రెగ్యులర్, ఫస్ట్ ఇయర్ రెఫరెల్ బ్యాచ్ ఫలితాలను విడుదల చేసారు. ఇట్టి ఫలితాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ knruhs.in లో పొందుపర్చారు.