కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ : కల్వకుంట్ల సంజయ్

కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ :  కల్వకుంట్ల సంజయ్

మెట్ పల్లి, మల్లాపూర్, వెలుగు: కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్​సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇవ్వాలని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం  మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తల్లులకు భరోసా, మహిళలకు రక్షణ ఉంటుందన్నారు.

కేసీఆర్​సర్కార్​ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనన్నారు. ఎన్నికల టైమ్ లో ఓట్ల కోసం వచ్చేవారి మాయమాటలు  నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇక్కడే పుట్టి ఇక్కడి ప్రజలకు అండగా ఉండే తనను గెలిపించుకుంటే ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.

అంతకుముందు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మెట్ పల్లి, కోరుట్ల పట్టణాల్లో ముస్లింలను కలిసి మద్దతు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సరోజన , జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి , ముస్లిం నాయకులు ఖుతుబొద్దిన్ పాషా, జావీద్ పటేల్, షేక్ నవాబ్, సర్పంచులు మమత, మల్లు, నర్సయ్య , సరోజన, ఎంపీటీసీలు లక్ష్మీ , శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.