ఏప్రిల్​ 19న ఇలా చేయండి.. పాపాలు.. శాపాలు పోతాయి.. పురాణాల్లో ఏముంది..

 ఏప్రిల్​ 19న ఇలా చేయండి.. పాపాలు.. శాపాలు పోతాయి.. పురాణాల్లో ఏముంది..

 ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటుచేసుకుని ఉంటుంది. అందులో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి , దీనినే 'దమన ఏకాదశి' అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలూ చెబుతున్నాయి. 

కామద ఏకాదశి రోజున ( ఏప్రిల్​ 19) ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం ... జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది

సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతుంటారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్నిసమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలో నైన , దేవాలయంనకు వెళ్లినప్పుడైన తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా 'కామదా ఏకాదశి వ్రతం' ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. 

కామద ఏకాదశి శుభ ముహూర్తం...

ఈ ఏడాది కామద ఏకాదశి ఏప్రిల్ 19 న జరుపుకుంటున్నారు. ఈ ఏకాదశి శుభ ముహూర్తం.ఏకాదశి తిథి ప్రారంభం ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 5:31 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. తిథి ముగింపు ఏప్రిల్ 19 రాత్రి 8.04 గంటల వరకు. ఉదయ తిథి ప్రకారం 19వ తేదీ కామద ఏకాదశి వ్రతం ఆచరించాలి.

కామద ఏకాదశి పరిహారాలు

కామద ఏకాదశి రోజు కొన్ని చర్యలు ఆచరించడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. సమస్యలన్నీ తొలగిపోతాయి. కామద ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అలాగే శమీ మొక్కని పూజించాలి. పిండి దీపం వెలిగించి అందులో కర్పూరం, పసుపు వేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి అందుతుంది. గ్రహాల శుభ ప్రభావం మీ మీద ఉంటుంది.

పితృ దేవతలకు నైవేద్యం:  ఏకాదశి రోజు పవిత్ర నది స్నానం ఆచరించడం ఎంతో ముఖ్యం. లేదంటే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయాలి. పితృ దేవతలను స్మరించుకుంటూ వారికి తర్పణాలు, నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పూర్వికుల దోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి.

కోరికలు నెరవేరెందుకు: మీ మనసులోని కోరికలు నెరవేరాలని అనుకున్నట్లయితే కామద ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించాలి. తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి. సాత్విక వస్తువులను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.

ఆర్థిక లాభం కోసం: ఏడు పసుపు కొమ్ములు తీసుకొని ఒక వస్త్రంలో చుట్టి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఏకాదశి రోజు లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తిని పూజించాలి. కనకధారా స్తోత్రం, విష్ణు సహస్ర నామాన్ని పఠించడం వల్ల ధనధాన్యాలకు కొదువ ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.

ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేసే రోజు: అందుకే ఈ ప్రత్యేకత ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసం. కామద ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు. శాపాలు, పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రాహ్మణ హత్య వంటి మహా పాతకాల నుంచి క్షమాపణ లభిస్తుంది.  అంతేకాక తెలిసి... తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారుజ అలాగే కామద ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వాసం. ఈరోజు( ఏప్రిల్​ 19) ఉపవాసం  ఉండి పూజ చేయడం వల్ల మోక్షం లభించి వైకుంఠానికి చేరుకుంటారని నమ్ముతారు.

also read : ఏప్రిల్​ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..

కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. 

పురాణ కథ

వరాహ పురాణం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం, విశిష్టతను వివరించాడు . వశిష్ట మహాముని దిలీప్ రాజు కి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు, నాట్యాలు చేసిన రాజునూ సంతోషపరిచేవారు ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు, తనభార్య లలితతో చాల అనోన్యంగా, ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరు కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలోపడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళా అంత నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఖంతో భర్తను తీసుకొని అడవులోకి ప్రయాణమైంది .

 అల వింధ్యాచల అడువుల్లో ప్రయాణిస్తూ వుండగా శ్రింగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన లలిత శ్రింగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి .. తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాదేయపడింది. అప్పుడు శ్రింగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు, ఆ కధ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి, ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్దలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భ ర్తను మీరే ఏ విధంగానైన కాపాడాలి అని మనసులో తలచుకోని నమస్కరించి తన ప్రక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి.