కమల్ హాసన్ ఆస్తులు రూ. 176 కోట్లు

కమల్ హాసన్ ఆస్తులు రూ. 176 కోట్లు

తమిళనాడులో ఏప్రిల్ 6 న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తనకు మొత్తం రూ.176 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో  రూ.45 కోట్లకు పైగా చరాస్తులు, రూ.131 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.  రూ.2.7 కోట్ల లెక్సస్ కారు, లండన్ లో2.5 కోట్ల ఇళ్లు, రూ. 45 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. రూ.57 కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడించారు.