విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు లోకనాయడుకు కమల్ హాసన్(Kamal Haasan). ప్రస్తుతం ఇండియన్ 2(Indian2) షూటింగ్ నిమిత్తం విజయవాడలో ఉన్న కమల్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా కృష్ణ విగ్రహాన్ని కమల్ తన చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ లీడర్ దేవినేని అవినాష్ కూడా పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ పై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహావిష్కరణకు విచ్చేసిన కమల్ హాసన్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విజయవాడలో జరుగుతోంది. దాదాపు 800 వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు దర్శకుడు శంకర్. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఉండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హీరో సిద్దార్థ్, ఎస్జె సూర్య, బాబీ సింహా తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Also Read :-నీ అయ్య.. నా సాలా.. యూట్యూబ్ను షేక్ చేస్తున్న రాహుల్ కొత్త పాట