ప్రెసిడెంట్‌ పదవికి కమల కంటే ఇవాంక బెటర్

ప్రెసిడెంట్‌ పదవికి కమల కంటే ఇవాంక బెటర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార హోరు రంజుగా సాగుతోంది. బిడెన్–ట్రంప్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో వేడి పుట్టిస్తున్నారు. తాజాగా న్యూ హ్యాంప్‌షైర్‌‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. డెమొక్రాట్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ కంటే ఇవాంక ట్రంప్ ప్రెసిడెంట్‌గా బెటరని చెప్పారు. అమెరికాకు మహిళా ప్రెసిడెంట్ ఉండటాన్ని తాను మద్దతు ఇస్తానన్నారు. అయితే ఆ ప్రెసిడెంట్ పదవికి కమలా హ్యారిస్ పోటీదారు కాదన్నారు. ఈ పోస్టుకు కమల కంటే తన కూతురు, వైట్ హౌజ్ సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌ సరిగ్గా సరిపోతుందన్నారు. ‘మీకు తెలుసా? తొలి మహిళా అధ్యక్షురాలిని నేను చూడాలనుకుంటున్నా. కానీ ఆమె పోటీదారు కాదు. వాళ్లందరూ ఇవాంక అవ్వాలనే అంటున్నారు’ అని తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.