ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్​, వెలుగు: మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ఎన్నికల కోడ్​ అమలులో ఉంటుందని, ఎవరూ ఉల్లంఘించవద్దని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఎవరైనా రూల్స్​ అతిక్రమిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్​ను శనివారం కలెక్టర్ పరిశీలించారు. స్ర్టాంగ్​ రూమ్​ను తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్​ విక్టర్​, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.