‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన ‘పింఛన్ పైసల్లో రూ.216 కోత స్టోరీపై స్పందించిన పోస్టల్ ఇన్‌‌‌‌స్పెక్టర్

 ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన ‘పింఛన్ పైసల్లో రూ.216 కోత  స్టోరీపై స్పందించిన పోస్టల్ ఇన్‌‌‌‌స్పెక్టర్

లింగంపేట,వెలుగు: పింఛన్‌‌‌‌ డబ్బుల చేతివాటంపై ‘పింఛన్ పైసల్లో రూ.216 కోత’ అనే శీర్షికతో ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన స్టోరీకి కామారెడ్డి జిల్లా పోస్టల్ ఇన్‌‌‌‌స్పెక్టర్ శ్రావణ్ స్పందించారు. ఈ మేరకు నల్లమడుగులో ఆదివారం పోస్టల్ ఆఫీసర్లతో విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జీపీ ఆఫీస్‌‌‌‌లో గ్రామస్తులతో మాట్లాడారు.

 గ్రామంలోని 35 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.216 పింఛన్​ సొమ్మును తక్కువగా ఇచ్చినట్లు విచారణలో గుర్తించారు. వారికి రావాల్సిన డబ్బులను పంపిణీ చేశారు. విచారణలో సేకరించిన విషయాలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిచనున్నట్లు ఎస్‌‌‌‌పీఎం మురళి తెలిపారు.