
తనకు సినిమాలంటే చాలా ఇష్టమన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి.. నేను 1991లో వచ్చిన ప్రేమఖైదీ సినిమాకు ఆడిషన్ కు వెళ్లా.. అయితే ఫైనల్ ఆడిషన్ కు ఏదో పని ఉండి వెళ్లలేకపోయానని చెప్పారు. తర్వాత వ్యాపారాల్లోకి వెళ్లానన్నారు. వైఎస్సార్ ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
ALSO READ :- మహాలక్ష్మీ స్కీం: 24 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ
సాయిరాం శంకర్ నటించిన వెయ్ దరువెయ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి. దేశ చరిత్రలో ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. పదేళ్ల క్రితం తన నియోజకవర్గంలో ఎవరు గుర్తుపట్టలేదు కానీ..ఇపుడు దేశ విదేశాల్లో తనతో ఫోటోలు దిగుతున్నారని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా కేసీఆర్,రేవంత్ లకే దక్కుతుందన్నారు.