- కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పకడ్భందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గురువారం రామారెడ్డి , పోశానిపేట, మాచారెడ్డిలో ఎస్పీ పర్యటించారు.
నామినేషన్ సెంటర్ల వద్ద ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా అధికారులు అలర్టుగా ఉండలన్నారు. సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఏఎస్పీ ఛైతన్యారెడ్డి, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
