పనిలో చేయి కలిపి.. సలహాలు ఇచ్చి.. వ్యవసాయ అధికారి తారాదేవి

 పనిలో చేయి కలిపి.. సలహాలు ఇచ్చి.. వ్యవసాయ అధికారి తారాదేవి
  • కూలీలతో కలిసిపోయిన వ్యవసాయ అధికారి

కామేపల్లి, వెలుగు: కామేపల్లి మండల వ్యవసాయ అధికారి తారాదేవి ఫీల్డ్​ లెవెల్​లో రైతులకు సలహాలు ఇచ్చే క్రమంలో వారితో కలిసిపోతున్నారు. పొలాల వద్దకు వెళ్తే అరక పట్టుకొని దున్నుతున్నారు. కూలీలు పనుల్లో నిమగ్నమైతే వారితో చేయి కలుపుతోంది. శనివారం మండలంలోని కొండాయిగూడెం రెవెన్యూ పరిధిలో మిర్చి నారుమడులను ఆమె పరిశీలించారు.

 కూలీలతో కలిసిపోయి తాను కూడా నారు మడుల్లో మిర్చి గింజలు నాటారు. సలహాలు ఇస్తూనే వారితో కలిసి కాసేపు పనిచేశారు. మిర్చి నారుమడులను ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు విత్తిన 6 రోజులకు, 9 రోజులకు కాపర్ ఆక్సిక్లోరైడ్ ను 3 గ్రాములు తీసుకుని ఒక లీటరు నీటితో పిచికారీ చేయాలని చెప్పారు.