వరల్డ్ క్లాస్ మూవీతో మురిపిస్తానంటున్న కంగన

V6 Velugu Posted on Jan 04, 2021

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఘాటైన, దీటైన కామెంట్లతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌‌ను సొంతం చేసుకున్న కంగన.. తనదైన నటనతోనూ ప్రేక్షకుల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి కంగన ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తుండటం హాట్ టాపిక్‌‌గా మారింది. ధాకడ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీకి అవార్డ్ విన్నింగ్ ఫొటోగ్రాఫర్ టెట్సువో నగాటా సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరించనుండటం విశేషం. అంతేగాక ఈ సినిమాకు ఇంటర్నేషనల్‌‌గా బెస్ట్ యాక్షన్ క్రూ పని చేయనున్నట్లు కంగన పేర్కొంది. ఈ ఫిల్మ్‌‌ను వరల్డ్ క్లాస్ స్పై థ్రిల్లర్‌‌గా తీస్తున్నట్లు తెలిపింది. ధాకడ్‌‌ అద్భుతంగా వచ్చేందుకు టీమ్ మొత్తం విరామం లేకుండా పని చేస్తున్నామని, ఆ దిశగా డైరెక్టర్ రేజీ ఘాయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించింది. For #Dhaakad we have legendary french director of photography Tetsuo Nagata , his academy award winning work like La Vie en Rose has been an inspiration for whole world. Along with highly acclaimed international action crew @RazyGhai hoping to make world class spy triller 🙏 pic.twitter.com/zSA0wBSMck — Kangana Ranaut (@KanganaTeam) January 4, 2021

Tagged dhaakad, Tetsuo Nagata, world class

Latest Videos

Subscribe Now

More News