కరణ్ నువ్వు సినిమాలు ఆపెయ్.. సౌత్​ హీరోలను చూసి నేర్చుకో రణ్వీర్

కరణ్ నువ్వు సినిమాలు ఆపెయ్.. సౌత్​ హీరోలను చూసి నేర్చుకో రణ్వీర్

బాలీవుడ్​ ఫైర్​ బ్రాండ్​ కంగనా రనౌత్​ మరోసారి సంచలన కామెంట్స్​ చేసింది. స్టార్​ డైరెక్టర్​ కమ్​ ప్రొడ్యూసర్​ కరణ్​ జోహార్​పై చిందులు వేసింది. ఇటీవల రణ్​వీర్​ సింగ్​ అలియా భట్​తో తీసిన ‘రాకీ ఔర్​ రాణీకి ప్రేమ్​ కహానీ’ సినిమాను అత్తాకోడళ్ల డ్రామా అంటూ కొట్టిపారేసింది. దీనికి రూ. 250 కోట్ల బడ్జెట్టా?.. ఇలాంటి సినిమాలు తీసే బదులు రిటైర్​మెంట్ తీసుకో అంటూ కరణ్​పై పోస్ట్ చేసింది. 

అలాగే హీరో రణ్​వీర్​పై మాట్లాడుతూ.. నువ్వు కరణ్​లా బట్టలేసుకుంటూ అతడిలానే తయారవ్వకు. నలుగురిలో డిగ్నిటీతో ఎలా ఉండాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో సౌత్​ హీరోలను చూసి నేర్చుకో.. మన సంస్కృతిని నాశనం చేయకు అంటూ చివాట్లు పెట్టింది. ట్యాలెంట్​ ఉన్న వారు చాన్స్​ల కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లేమో ఇలాంటి సినిమాలతో టైం, మనీ వేస్ట్​ చేస్తున్నారంటూ కంగనా మండిపడింది.