“ద గ్రేట్ గ్రాండ్ మస్తీ” మూవీతో కుర్రకారుకు దగ్గరైన హాట్ బ్యూటీ కంగనా శర్మ (Kangna Sharma). పంజాబీ, హిందీ మ్యూజిక్ సాంగ్స్తో పాటుగా పలు వెబ్ సిరీస్ లలో బోల్డ్ పాత్రలతో మంచి గుర్తింపు పొందింది. అంతేకుండా తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్గా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
గురువారం సాయంత్రం ఏప్రిల్ 16న ముంబైలో బ్యూటీ కంగనా శర్మ ఒక రెస్టారెంట్ వెళ్ళింది. ఎప్పటిలాగే నటి కంగనా తన సొగసైన బ్యూటీతో (బోల్డ్ డ్రెస్సుతో) బయటకొచ్చింది. నలుపు రంగు కట్-అవుట్ మినీ లెదర్ డ్రెస్ ధరించి కనిపించింది. ఇక శర్మ బోల్డ్ స్టైల్ లుక్ చూసి అక్కడి సిబ్బంది, అభిమానులు గుమిగూడారు.
ఈ క్రమంలోనే ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా అభిమాని ఆమెతో ఫోటో తీసుకోవాలని కోరగా, శర్మ సంతోషంగా అంగీకరించింది. ఆపై లేడీ ఫ్యాన్ని దగ్గరికి తీసుకుని నవ్వుతూసెల్ఫీ ఇచ్చింది శర్మ.
కానీ ఫోటో తీసుకున్న వెంటనే ఆ ఫ్యాన్ అకస్మాత్తుగా ఆమెను వేలెత్తి చూపిస్తూ “నంగీ” అని కామెంట్ చేసింది. ఆ ఒక్క కామెంట్ అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. (నంగీ అంటే ‘నగ్నంగా ఉన్నది’ అని అర్థం). ఆ కామెంట్ అక్కడున్న వారందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కంగనా శర్మ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎలాంటి ఆగ్రహం చూపకుండా, ప్రశాంతంగా అక్కడి నుంచి రెస్టారెంట్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్ల రియాక్షన్స్..
ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. “ఇది వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక మహిళ ఎలా డ్రెస్ అవ్వాలో ఆమె నిర్ణయం” అని అంటున్నారు. అలాగే, కంగనా శర్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయకుండా వెళ్లిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఆ అభిమాని ప్రవర్తనను విమర్శిస్తున్నారు.
ఎవరీ కంగనా శర్మ?
బాలీవుడ్ బ్యూటీ కంగనా శర్మ 2016లో “ద గ్రేట్ గ్రాండ్ మస్తీ” సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు మ్యూజిక్ వీడియోలు, టీవీ షోలు, OTT ప్లాట్‌ఫార్మ్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. “మోనా హోమ్ డెలివరీ” వెబ్ షోతో ఆమె పేరు మరింత గుర్తింపు పొందింది. ముఖ్యంగా శర్మ తన బోల్డ్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటుంది.
వ్యక్తిగత జీవితం..
కంగనా శర్మ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. యోగేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె, ప్రస్తుతం విడాకుల ప్రక్రియలో ఉందని వెల్లడించింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు.. ఇవన్నీ తన నిర్ణయాలపై ప్రభావం చూపినట్టు ఆమె తెలిపింది. వరు కాంగ్నా శర్మ?

