
సూర్య హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. బాబీడియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. అక్టోబర్ 10న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా విడుదలను వాయిదా వేస్తూ, గురువారం కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. రజినీకాంత్ సినిమా ‘వేట్టయాన్’ అక్టోబర్ 10న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో రజినీకాంత్‌ను గౌరవిస్తూ తన చిత్రాన్ని సూర్య పోటీ నుంచి తప్పించినట్టు సమాచారం. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తోంది.