V6 News

OTT Thriller: ఓటీటీలోకి సస్పెన్స్‌తో కట్టిపడేసే క్రైమ్ థ్రిల్లర్.. వరుస హత్యలు, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్

OTT Thriller: ఓటీటీలోకి సస్పెన్స్‌తో కట్టిపడేసే క్రైమ్ థ్రిల్లర్.. వరుస హత్యలు, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్

కన్నడలో తెరకెక్కిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. స్టార్ యాక్టర్ విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన సీతారాం బినోయ్: కేస్ నెం.18కు సీక్వెల్‌గా రూపొందింది.

డైరెక్టర్ దేవి ప్రసాద్ శెట్టి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

కథేంటంటే:

ఈ సెకండ్ కేసు కథ ‘ఆనెగద్దె’ పట్టణంలో జరిగిన వరుస హత్యలతో మొదలవుతుంది. ఒకే విధానంలో జరిగే ఈ హత్యలు, ఒక మానసిక రుగ్మత  (Mental Disorder) కలిగిన కిల్లర్ చేసే మర్డర్స్ అనే అనుమానాలను కలిగిస్తాయి.

ఈ క్లిష్టమైన కేసును చేధించేందుకు ఇన్‌స్పెక్టర్ సీతారాం రంగంలోకి దిగుతాడు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, అతను వివిధ ఆధారాలను అనుసంధానిస్తూ అసలు నేరస్తుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తాడు.

ALSO READ : ‘లెనిన్’ సెకండ్ సింగిల్ రిలీజ్.. 

ఇదే సమయంలో, సీతారాం వ్యక్తిగత జీవితం కూడా కథలో సమాంతరంగా సాగుతుంది. కొన్నేళ్లుగా తన సోదరికిదూరంగా ఉంటూ వస్తున్న సీతారాం,  మళ్లీ కలవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇలా ఓ వైపు వరుస హత్యలు, మరోవైపు సిస్టర్ సెంటిమెంట్. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ తాను అనుకున్న లక్ష్యం ఛేదిస్తాడనేది మిగతా కథ. 

విశ్లేషణ:

సినిమా ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. ఒకే తరహాలో జరిగే హత్యలు కథను ముందుకు నడిపిస్తూ ఆసక్తిని పెంచుతాయి. బాధితుల శరీరాలపై 50కి పైగా గాయాలు ఉండటం, హంతకుడి క్రూరత్వాన్ని బలంగా చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ బాడీలను గమనించిన పాథాలజిస్ట్ విస్తుపోయే నిజాలను బయటపెడతాడు.

ఈ హత్యల వెనుక తీవ్రమైన మానసిక రుగ్మత (Completely Psychopath) కలిగిన వ్యక్తి ఉన్నాడని సీతారాంకి చెబుతాడు. కానీ, అతను ఈ హత్యలన్నీ జనాల మధ్యనుండే చేస్తున్నాడు. కంటికి కనిపించని, చెవులకి వినిపించని మార్గంలో మర్డర్స్ చేస్తూ తన సైకో యాంగిల్ని చుపిస్తున్నట్లుగా వివరిస్తాడు 

అయితే, ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలు.. అంటే ‘చంపిన వాళ్ళ ఫింగర్ ఫ్రంట్స్, డీఎన్ఏ, హత్యకు సంబంధించిన ఆయుధాలు’ వంటి కీలక అంశాలు మిస్ అవుతాయి. ఈ క్రమంలోనే కేసు ఛాలెంజ్గా మారుతుంది. ఆపై సీతారాం చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతాయి. ఒక్కో క్లూను పట్టుకుని కేసును ముందుకు తీసుకెళ్లే విధానం బాగుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. 

మొత్తంగా, సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. సీక్వెల్‌గా ఇది ఫస్ట్ పార్ట్ కంటే మించిన సస్పెన్స్ కలిగిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బెస్ట్ ఆప్షన్.