
కన్న స్టార్ హీరో కిచ్చా సుదీప్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కర్నాటకలో రాజకీయాల మార్పు కోసం బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ (ఏప్రిల్ 5) మధ్యాహ్నం 1:30 గంటలకు బీజేపీ పార్టీ ఆఫీసును సందర్శించి.. అక్కడ అధికారికంగా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
కర్నాటకలో పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రాష్ట్రలోని ప్రముఖులు వివిధ పార్టీల్లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు సినీ నటులను కలిసినట్లు తెలుస్తోంది.
కర్నాటకలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుదీప్ ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి వివిధ పార్టీలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం అందింది. అయితే, సుదీప్ నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా లేక కేవలం బీజేపీకి ప్రచార అంబాసిడర్‌గా మారతాడా అనేది ఇవాళ (ఏప్రిల్ 5) తేలనుంది.