హీరో సిద్దార్థ్కు క్షమాపణలు చెప్పిన శివరాజ్ కుమార్

హీరో సిద్దార్థ్కు క్షమాపణలు చెప్పిన శివరాజ్ కుమార్

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Shiva rajkumar) కర్ణాటక ప్రజల తరపున హీరో  సిద్ధార్థ్‌(Siddarth)కు క్షమాపణలు తెలిపారు.  కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో నిరసనకారులు హీరో  సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై శివ రాజ్ కుమార్ స్పందిస్తూ..  ‘మనం ఎప్పుడూ ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. కన్నడ చిత్ర పరిశ్రమ తరపున సిద్దార్ధ్ క్షమించండి. మీ కార్యక్రమంలో ఇబ్బంది పెట్టినవారు ఎవరో నాకు తెలియదు. మాకు ఈ ఘటన చాలా బాధను కలిగించింది. ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాదు.. అంటూ శివ రాజ్‌కుమార్ ట్వీట్ చేశారు.

ALSO READ: భార్యకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్..నెటిజన్లు ఫిదా
 

ఇంతకీ ఏం జరిగింది

సిద్ధార్థ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిన్నా’.  ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ క్రమంలో  కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సిద్ధార్థ్‌ పాల్గొన్నారు. అయితే  కార్యక్రమం మొదలు కాగానే కొందరు నిరసన కారులు అక్కడికి చేరుకుని ప్రెస్‌మీట్‌ ఆపేయాలని సిద్ధార్థ్‌కు సూచించారు. లేదంటే కావేరి ఉద్యమానికి మద్దతు తెలపాలని సిద్ధార్థ్‌ను కోరారు . నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. సమావేశాన్ని నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.  దీంతో  సిద్ధార్థ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.