ప్రస్తుతం.. ఆడియన్స్ అన్నీ భాషల సినిమాలు చూస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి సినిమాపై ఓ లుక్కేస్తున్నారు. ఒకప్పుడు కేవలం తమ భాషలో రిలీజైన సినిమా మాత్రమే థియేటర్లో చూసే అవకాశం ఉండేది. నిజానికి థియేటర్కి వెళ్లి చూస్తే అదే మహా గొప్ప. ఇప్పుడు అలా కాదు.. డిజిటల్ రంగం ఎంట్రీతో ఆడియన్స్కి సినిమాల జాతరగా మారింది. జస్ట్ ఖాళీ టైం దొరికితే చాలు.. సబ్ టైటిల్స్ పెట్టుకొని అయినా సినిమా చూసేస్తున్నారు. అలా తాజాగా స్టార్ హీరో, కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టి ఓ సినిమా చూసి ఫిదా అయినట్లుగా తెలిపారు. అదే రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘యూత్’ (Youth).
రిషబ్ శెట్టి ‘యూత్’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ, ఇది భావోద్వేగభరితమైన, హృదయాన్ని తాకే చిత్రం అని పేర్కొన్నారు. కెన్ కరుణాస్ దర్శకత్వం, నటన సినిమాకు ప్రధాన బలం అని చెప్పారు. అంతేకాకుండా సినిమా రంగానికి కెన్ కరుణాస్ ఒక గొప్ప ఆస్తి అని చెప్పి తన ప్రేమను వ్యక్తపరిచాడు.
రిషబ్ శెట్టి X వేదికగా స్పందిస్తూ.. ‘‘చాలాకాలం తర్వాత, ఒక సినిమా చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. ‘యూత్’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలున్నాయి. తల్లిదండ్రులకు ఇచ్చిన గొప్ప బహుమతి ‘యూత్’. తెరపై సూరజ్ వెంజరమూడ్, దేవదర్శిని మరియు ఇతర నటీనటులంతా చాలా సహజంగా కనిపించారు. అలాగే సంగీత దర్శకుడు జివి ప్రకాశ్, సినిమాటోగ్రాఫర్ వికీ, ఎడిటర్ నాష్ మరియు నిర్మాతలు.. ఇలా ప్రతి టెక్నీషియన్ సినిమాకు ప్రాణం పెట్టారు’’ అని రిషబ్ అన్నారు.
After a long time, I found myself smiling throughout an entire film. #Youth is filled with love, friendship, and deep emotions — a heartfelt tribute dedicated to all parents.
— Rishab Shetty (@shetty_rishab) April 20, 2026
Single handedly writing, directing and acting with such nuanced depth is truly commendable. Every actor… pic.twitter.com/uaz5NV2Z2u
దర్శకుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన రిషబ్.. సినిమా రంగానికి కెన్ కరుణాస్ ఒక గొప్ప ఆస్తి అని ప్రత్యేకంగా అభినందించారు. రిషబ్ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం 23 ఏళ్ల వయసులోనే హీరోగా, దర్శకుడిగా మెప్పించడం అంటే మాములు విషయం కాదంటూ నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ చిత్రాన్ని 53 రోజుల్లో పూర్తి చేసి హిట్ కొట్టడం అంటే, కెన్ కరుణాస్ మేకింగ్ స్టైల్కి నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు.
►ALSO READ | Atlee Priya Baby: డైరెక్టర్ అట్లీ రెండోసారి తండ్రయ్యాడు..
గత మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి మంచి స్పందన పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ మరింత క్రేజ్ సంపాదిస్తోంది.
‘యూత్’ కథ:
మధ్యతరగతి కుర్రాడు ప్రవీణ్ (Ken Karunas) అల్లరి కుర్రాడు. అతనివైపు స్కూల్లో ఏ అమ్మాయి కన్నెత్తి చూడదు. అయినప్పటికీ స్కూల్ లైఫ్ పూర్తయ్యేలోపే ఒక అమ్మాయిని ప్రేమించాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలోనే గంగవల్లి, ప్రేషిక, సోనాల్ అనే అమ్మాయిలు తన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు.
వారి రాక అతని జీవితాన్ని మలుపుతిప్పుతాయి. లవ్, బ్రేకప్‌లు, అవమానాలు అన్నీ ఎదుర్కొంటాడు. వీటి మధ్య ప్రవీణ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ప్రయాణంలో తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాడా? లేదా? అన్నదే మిగతా కథ.

