మా సభ్యత్వం రద్దుపై న్యాయపోరాటానికి సిద్ధం: కరాటే కల్యాణి

మా సభ్యత్వం రద్దుపై న్యాయపోరాటానికి సిద్ధం: కరాటే కల్యాణి

సినీ న‌టి కరాటే కళ్యాణిని మా అసోసియేష‌న్ నుంచి స‌స్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించింది కరాటే కళ్యాణి."ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే త‌న‌ను ‘మా’ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశార‌ని ఆమె ఆరోపించింది. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత తన తరుపు న్యాయవాదితో వివరణ ఇచ్చాన‌ని తెలిపింది. ఇక తాను వేసిన పిటిష‌న్‌కు ‘మా’ అసోసియేష‌న్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, కారణం లేకుండా సస్పెండ్ చేయడంపై న్యాయపోరాటం చేయ‌నున్న‌ట్లు కరాటే కల్యాణి తెలిపింది.

అంతేకాదు తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని, కానీ శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రం తాను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు మ‌రోసారి స్పష్టం చేసింది. ఇక ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు కరాటే కల్యాణి వ్యతిరేకంగా మాట్లాడడంపై సీరియ‌స్ అయిన ‘మా’ అధ్య‌క్షుడు మంచు విష్ణు.. ఆమెకు  షోకాజ్‌నోటీసులు జారీ చేసిన  విషయం తెలిసిందే. కరాటే క‌ళ్యాణి ఇచ్చిన వివ‌ర‌ణ‌పై మా కార్య‌వ‌ర్గం సంతృప్తి చెంద‌లేద‌ని, అందుకే ఆమెను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘు బాబు ప్రకటించాడు.