
- కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్, వెలుగు: పీహెచ్‌సీల్లో ఔషధ మొక్కలు నాటాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. సోమవారం తిమ్మాపూర్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వార్డు, ల్యాబ్, ఫార్మసీ, ప్రసూతి గదిని పరిశీలించారు. హాస్పిటల్‌కు వచ్చిన వారితో మాట్లాడి, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. మాతాశిశు సంరక్షణ కార్డును పరిశీలించి టీకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు.
అనంతరం రామకృష్ణకాలనీలోని ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. ‘బుధవారం బోధన’ను అన్ని స్కూళ్లలో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆమెతోపాటు డీఎంహెచ్‌వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో సురేందర్, ఎంఈవో శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ ప్రిసిల్లా పాల్గొన్నారు.